ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం - కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశం: రేపు సీఎం ఏరియల్ సర్వే ..!!
ఏపీలో భారీ వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలిచ్చారు. జిల్లాల్లో పరిస్థితుల పైన వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ప్రభావం ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపింది. నెల్లూరుకు సీనియర్ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు సీనియర్ అధికారి ప్రద్యుమ్న, కడపకు మరో సీనియర్ అధికారి శశిభూషణ్ కుమార్‌లను నియమించారు. వర్షాలపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు..స్థానిక పరిస్థితులను వివరించారు.
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-jagan-orders-collectors-to-give-rs-5-lakh-exgratia-to-those-families-who-lost-their-loved-ones-306479.html
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-jagan-orders-collectors-to-give-rs-5-lakh-exgratia-to-those-families-who-lost-their-loved-ones-306479.html
Comments
Post a Comment